ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా పేరు ఓజి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. ఇలా ఓజి సినిమా ఈ పనిలో ఉంటే రీసెంట్ గా ఇచ్చిన మీడియా ఇంటరాక్షన్ లో సుజీత్ అసలు సాహో సినిమా తర్వాత తను ప్లాన్ చేసుకున్న సినిమా కోసం చెప్పడం జరిగింది..
అయితే తన నెక్స్ట్ సినిమాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో యూకే బ్యాక్ డ్రాప్ లో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ అనుకున్నట్టు తెలిపాడు. కానీ అప్పుడు కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు అని తెలిపాడు. దీనితో వీరి కాంబినేషన్ లో కూడా సినిమా పడితే బలే ఉండేది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి భవిష్యత్ లో ఏమన్నా ఉంటుందేమో చూడాలి..!!