in

Alia Bhatt trolled for calling Alpha her first action film!

టీవల ఇటలీలోని మిలాన్‌లో గూచీ స్ప్రింగ్/సమ్మర్ 2026 ఫ్యాషన్ షో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గూచీ గ్లోబల్ అంబాసిడర్‌గా హాజరైన ఆలియా భట్, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రం ‘ఆల్ఫా’ గురించి ప్రస్తావిస్తూ, అది తన కెరీర్‌లోనే మొదటి యాక్షన్ సినిమా అని, ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, కాస్త భయంగా కూడా ఉందని తెలిపారు..

ఆలియా చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. ‘ఆల్ఫా’ ఆమె మొదటి యాక్షన్ సినిమా ఎలా అవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆమె నటించిన ‘రాజీ’, ‘జిగ్రా’ వంటి చిత్రాల్లో కూడా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’లో సైతం ఆమె తన యాక్షన్ ప్రతిభను నిరూపించుకున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతటి అనుభవం ఉన్నప్పటికీ, ‘ఆల్ఫా’ను తన తొలి యాక్షన్ చిత్రంగా పేర్కొనడం సరికాదని విమర్శిస్తున్నారు..!!

They Call Him OG Review!

They Call Him OG Reviews!

director Sujeeth and Ram Charan’s film was dropped!