in

JR NTR sustained a injury while shooting for an advertisement!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వృత్తిపట్ల చూపే నిబద్ధత, కమిట్‌మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి రుజువైంది. ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణలో గాయపడినప్పటికీ, నిర్మాత ఆర్థికంగా నష్టపోకూడదనే సదుద్దేశంతో నొప్పిని భరిస్తూనే మరుసటి రోజే షూటింగ్‌ను పూర్తి చేసి అందరి మన్ననలు పొందారు.

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ జరుగుతుండగా ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో వైద్యులు ఆయనను కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే, తాను కోలుకునే వరకు షూటింగ్ వాయిదా వేస్తే, అప్పటికే భారీగా వేసిన సెట్స్ కారణంగా స్టూడియో అద్దె భారం నిర్మాతపై పడుతుందని ఎన్టీఆర్ భావించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం కొత్త షెడ్యూల్‌లో పాల్గొననున్నారు..!!

They Call Him OG quiz!

Akhanda 2: Grand song shoot with 600 dancers