in

keerthy suresh as heroine, rajashekar villain for vd’s next!

విజయ్ ఇటీవల గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఐతే, ఇప్పుడు విజయ్‌ చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. వాటిలో రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు అయింది. ఇక ఈ సినిమాతో పాటు యువ దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కించనున్న ‘రౌడీ జనార్దన’ సినిమా కూడా పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

ఐతే, తాజాగా ఈ సినిమాలో నటించే ప్రతినాయకుడి పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు విలన్ గా కనువిందు చేయనున్నట్లు టాక్. పైగా ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందట. అలాగే, రాజశేఖర్ లుక్‌ కూడా మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. ఇప్పటికే లుక్‌ టెస్ట్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది..!!

rgv heroine naina ganguly abused by her boyfriend!

They Call Him OG quiz!