in

Retired IPS officer files case against Ram Gopal Varma!

మొన్నటి వరకు వ్యూహం సినిమా వివాదంలో పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగిన వర్మ దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అనుకునే నేపథ్యంలో మరో కేసులో ఇరుక్కున్నారు..రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రిటైర్డ్ మహిళా ఐపీఎస్ రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు చేశారు. దహనం వెబ్ సిరీస్ పై ఫిర్యాదూ చేశారు రిటైర్డ్ ఐపీఎస్. తన అనుమతి లేకుండా తన ప్రొఫైల్ ను దహనం అనే వెబ్ సిరీస్ లో వాడారని మహిళ రిటైర్డ్ ఐపీఎస్ ఫిర్యాదు చేశారు.

‎దహనం సినిమాకు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ గా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. దాంతో రామ్ గోపాల్ వర్మ పై కేస్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. రామ్ గోపాల్ వర్మ పై పోలీసులు IPC 509, 468, 469, 500, and 120(B). సెక్షన్ ల కింద కేస్ నమోదు చేశారు పోలీసులు. ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో దహనం అనే సిరీస్ ను తెరకెక్కించారు వర్మ. కమ్యూనిస్ట్‌ నేత రాములును ఎలా హత్య చేశారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఒక కొడుకు కథగా ఈ వెబ్‌ సిరీస్‌ ను నిర్మించారు వర్మ..!!

Do You Wanna Partner!

Maheswari Says She Was shocked When Ajith Called Her sister!