in

Zombie Reddy 2: Teja Sajja’s Next Film Confirmed

మిరై విజయంతో ఉత్సాహంగా ఉన్న యువ హీరో తేజ సజ్జ హీరోగా  తదుపరి క్రేజీ  ప్రాజెక్ట్‌ను ఈరోజు నిర్మాత ప్రకటించారు.  జాంబిరెడ్డి పార్ట్ 2 ను పాన్ వరల్డ్ స్థాయిలో  మళ్ళీ తమ పీపుల్ మీడియా బ్యానర్ లోనే నిర్మిస్తున్నట్టు నిర్మాత   విశ్వ ప్రసాద్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆదివారం జరిగిన బిగ్ బాస్ షోలో స్టేజ్ మీద హోస్ట్ నాగార్జున సమక్షంలో వెల్లడించారు. మిరై హిట్ అయిన సందర్భంగా  బిగ్ బాస్ షోలో తేజ సజ్జ, హీరోయిన్ రితికా, ప్రొడ్యూసర్  విశ్వ ప్రసాద్ లు  మెరిశారు..

ఈ సందర్భంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా జాంబి రెడ్డి 2 విషయాన్ని ప్రకటించారు. మొదటి భాగం విజయవంతం కావడంతో, రెండో భాగాన్ని మరింత గ్రాండ్ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, జాంబి రెడ్డి 2 ను వెంటనే స్టార్ట్ చేస్తామని తెలిపారు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్న ఈ చిత్రం మరింత అద్భుతమైన విజువల్స్ తో వస్తుందని చెప్పారు. మిరైతో తేజ సజ్జ తన నటనలో కొత్త కోణాన్ని చూపించాడు..!!

Pawan Kalyan OG will feature a special song Neha Shetty!