ప్రముఖ కన్నడ నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసిన కేటుగాళ్లు, వారిద్దరి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేశారు. ఈ షాకింగ్ విషయాన్ని స్వయంగా ఉపేంద్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించి, తమ అభిమానులను, ప్రజలను అప్రమత్తం చేశారు..
వివరాల్లోకి వెళితే, ఉపేంద్ర భార్య ప్రియాంకకు ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆర్డర్ చేసిన వస్తువు డెలివరీ కోసం కాల్ చేస్తున్నట్లు నమ్మబలికాడు. డెలివరీ ప్రక్రియ పూర్తి కావాలంటే కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు, నంబర్లను ఫోన్లో ఎంటర్ చేయాలని సూచించాడు. అది నిజమని నమ్మిన ఆమె, అవతలి వ్యక్తి చెప్పినట్లే చేయడంతో ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని ఉపేంద్ర తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని ఆయన వివరించారు..!!