తనపై సోషల్ మీడియాలో చేస్తోన్న అసభ్యకర పోస్టులపై ప్రముఖ మోడల్, హీరోయిన్ రంగ సుధ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ అనే వ్యక్తి కొన్ని ట్విట్టర్ పేజీల్లో తనపై అసభ్యకర పోస్టులు షేర్ చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము కలిసి ఉన్న టైంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బయటపెడతానని తనను బెదిరించినట్లు పోలీసులకు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు..
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గతంలో రంగ సుధకు రాధాకృష్ణ అనే వ్యక్తితో పరిచయం కాగా..ఇద్దరు సన్నిహితంగా ఉన్న టైంలో ఫోటోలు తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుండగా..ఆ కోపంతోనే అసభ్యకర పోస్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు..!!