in

trivikram in search of actress for venkatesh!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై క్లారిటీ లేకపోవడం అభిమానుల్లో కన్ఫ్యూజన్ సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు ఓ పేరును ఫైనల్ చేసినట్టు సమాచారం. కానీ దానిని అధికారికంగా ప్రకటించలేదు. మొదట రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికవుతారని వార్తలు వచ్చాయి..

తాజాగా మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’లో నటించింది. అదే విధంగా వెంకటేష్‌తో ‘సైంధవ్’లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చర్చల్లో ఉంది. ఆమెతో పాటు నేహా శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో త్రివిక్రమ్ ఎవరిని సెలెక్ట్ చేస్తాడనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది..!!

anupama finally clears on ‘rangasthalam’ rumors!