in

Ileana D’Cruz: excited and planning to return to films

కప్పుడు టాలీవుడ్‌ను తన అందం, అభినయంతో ఏలిన గోవా బ్యూటీ ఇలియానా డి’క్రజ్ తన సినీ పునరాగమనంపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. పెళ్లి, పిల్లల కారణంగా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, నటనకు గుడ్‌బై చెప్పలేదని, సరైన సమయంలో తప్పకుండా రీఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. తాజాగా నటి నేహా ధూపియాతో జరిగిన ఓ లైవ్ సెషన్‌లో పాల్గొన్న ఇలియానా, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు..

ప్రస్తుతం తన పూర్తి సమయం ఇద్దరు కుమారులకే కేటాయిస్తున్నానని ఇలియానా తెలిపారు. “సినిమాల్లోకి తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నాను. కెమెరా ముందు నటించడం, అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం, సినిమా సెట్స్‌లో ఉండే వాతావరణాన్ని నేను తీవ్రంగా మిస్ అవుతున్నాను. నా పని అంటే నాకు చాలా ఇష్టం. కానీ, ప్రస్తుతం నా ఇద్దరు పిల్లలే నా ప్రపంచం. వారి ఆలనాపాలనా చూడటమే నా మొదటి ప్రాధాన్యత. అందుకే నటనకు కాస్త విరామం ఇచ్చాను” అని ఆమె వివరించారు..!!

star beauty Deepika to join Allu Arjun-Atlee’s ‘AA22xA6’ shoot!