in

taja sajja’s ‘Mirai’ becomes the most anticipated film in India!

సూపర్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిరాయ్’ ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినిమా మీద హైప్ అమాంతం పెరిగిపోయింది. దీని ప్రభావం (IMDb)లో కూడా కనిపించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది..

పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఇతర పెద్ద చిత్రాలకంటే 19% ఓట్లు ఎక్కువ సాధించడం విశేషం. ట్రైలర్‌లో చూపించినట్లు, ఈ సినిమా మైథాలజికల్, హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసిన ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న ఎనిమిది భాషల్లో భారీ విజువల్ స్పెక్టాకిల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది..!!

Rashmika Mandanna to turn ghost for Kanchana 4!