in

hamsa nandini ready to act again after cancer treatment!

కప్పుడు హీరోయిన్‌గా వెలుగులు వెదజల్లిన ఈ బ్యూటీ, తన అందం – అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి క్రేజ్‌ సొంతం చేసుకుంది. అయితే కెరీర్ జోరులో ఉండగానే క్యాన్సర్ బారిన పడి చాలా కాలం చికిత్స తీసుకుంది. ఇప్పుడు ఆ వ్యాధిని జయించి తిరిగి కొత్త జీవితం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే ఈమె, తాజాగా వినాయక చవితి సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ హంసానందిని. ఒకటవుదాం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, అనుమానాస్పదం మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత అధినేత, అహా నా పెళ్లంటా వంటి సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేదిలో స్పెషల్ సాంగ్‌తో పాటు, రామయ్యా వస్తావయ్యా, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల్లో మెరిసింది. ఇంతలోనే ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కీమోథెరపీ చికిత్సలు తీసుకోవాల్సి వచ్చింది. గతంలో ఇదే వ్యాధితో ఆమె తల్లి ప్రాణాలు కోల్పోవడం మరింత కఠినంగా మారింది. అయినా ధైర్యంగా పోరాడి క్యాన్సర్‌పై విజయం సాధించింది..!!

Chiranjeevi In Prabhas And Sandeep Reddy Vanga’s Spirit?

Sundarakanda!