మొన్న సమంత..నిన్న శ్రీలీల..నేడు పూజా హెగ్డే..ఇలా స్టార్ హీరోయిన్లు అందరూ ఐటెం సాంగ్స్ బాట పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలో ఐటెం డ్యాన్సులు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. దీంతో ఇందులో నటిస్తున్న హీరోయిన్లు కూడా పారితోషకాన్ని పెంచేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ‘ఊ.. అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ ఐటెం సాంగ్ యమా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ ఈ పాట చాలా మందికి ఫేవరెట్ గా నిలిచింది..
ఈ పాట కోసం స్టార్ హీరోయిన్ సమంత అత్యధిక పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఈ పాటలో ఐదు నిమిషాలు కనిపించినందుకు గానూ.. మె దాదాపుగా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంటే నిమిషానికి కోటి రూపాయలు పారితోషకం తీసుకున్నట్లు లెక్క. సమంత కెరీర్లో ఇదే తొలి ఐటెం సాంగ్. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ ట్రెండ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్లు అందరూ అదే బాట పడుతున్నారు..!!