in

Tamannaah and Diana Penty to star in ‘Do You Wanna Partner’!

టీటీ ప్రేక్షకులకు చేరువైన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా మరో వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇప్పటికే పలు వెబ్‌ ప్రాజెక్టులతో అలరించిన ఆమె, ఇప్పుడు ‘డు యూ వనా పార్ట్‌నర్‌’ అనే సిరీస్‌లో నటించారు. ఈ కామెడీ–డ్రామా వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ కంటెంట్‌గా వస్తోంది. తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబరు 12 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటి డయానా పెంటీ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు..

కాలిన్, అర్చిత్‌కుమార్ సంయుక్త దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఇద్దరు యువతుల స్నేహం, వారు ఎదుర్కొనే సవాళ్లు, జీవితంలో వచ్చే మార్పుల చుట్టూ తిరుగుతుంది. ఇటీవల ‘ఓదెల 2’ తో ప్రేక్షకులను పలకరించిన తమన్నా, ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘రోమియో’ చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించనుండగా, ‘రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్’ ఫ్రాంచైజీ మూడో భాగంలో కూడా తమన్నా హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..!!

Lakshmi Menon Accused Of Kidnapping and Assaulting!