in

Balakrishna: 50 Years in Cinema, A World Record!

నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం!
టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని తాజాగా ముగించుకొని గ్రాండ్ లెవెల్ లో.. ఆ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బాల‌య్య‌కు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ (WBR) గోల్డ్ ఎడిషన్లో ఆయన చోటు దక్కించుకున్నారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఈ ఘనతను దక్కించుకున్న మొట్టమొదటి నటుడు బాలకృష్ణ‌ కావడం విశేషం.

‘వర‌ల‌ల్డ్‌ బుక్ ఆఫ్ రికార్డ్’ లో బాలకృష్ణ కు చోటు!
ఈ ఘనతను సెలబ్రేట్ చేసుకుంటూ ఈనెల 30న హైదరాబాద్‌లో బాలకృష్ణను గ్రాండ్ లెవెల్ లో సత్కరించేందుకు వర‌ల‌ల్డ్‌ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా సంస్థ సీఈవో సంతోష్ శుక్లా దీనిపై క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ఘనమైన వారసత్వాన్ని, హిందూపూర్ శాసనసభ్యుడిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్ పర్సన్ గా ప్రజలకు అందించిన సేవలను ప్రశంసనీయమని చెప్పుకొచ్చిన ఆయన.. బాలకృష్ణ గొప్పతనం, వెండితెరను మించిపోయి విస్తరించిందని అంకిత భావం, సామాజిక సేవ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమంటూ రాసుకొచ్చారు..!!

Janhvi Kapoor responds to casting criticism for ‘Param Sundari’

pooja hegde desperate for a solid comeback in telugu!