సినిమాలు తగ్గించిన సమంత!
సమంత మాట్లాడుతూ, “ఇకపై ఒకేసారి ఐదు సినిమాలు చేయను. నా శరీరం చెప్పే మాట వినాలని తెలుసుకున్నాను. అందుకే పనిభారాన్ని తగ్గించుకుంటున్నాను. నా శారీరక, మానసిక ఆరోగ్యానికే నా మొదటి ప్రాధాన్యత” అని తెలిపారు. అయితే, ప్రాజెక్టుల సంఖ్య తగ్గినా వాటి నాణ్యత విషయంలో మాత్రం కచ్చితంగా పెరుగుదల ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. “తక్కువ సినిమాలు చేసినా, ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలతోనే పలకరిస్తాను” అని వివరించారు..
సినిమాలు తగ్గించడానికి కారణం ఏంటో చెప్పిన సమంత!
గత 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని, గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందని సమంత అన్నారు. సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ, “సామాజిక మాధ్యమాల్లో మనకు వచ్చే ప్రశంసలను ఎలా ఆనందంగా స్వీకరిస్తామో… ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లను కూడా అంతే హుందాగా తీసుకోవాలి. అది మన జీవితాన్ని నియంత్రించే స్థాయికి వెళ్లకూడదు” అని ఆమె పేర్కొన్నారు..!!