భీమవరంలో జరిగిన కార్యక్రమానికి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వానికి చెందిన వాహనంలో రావడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ అధికారులే ఆమె కోసం ప్రత్యేకంగా ఆ వాహనాన్ని పంపారని కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు ప్రచారం చేశాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో నిధి అగర్వాల్ స్వయంగా స్పందించి వివరణ ఇచ్చారు.
“భీమవరం పర్యటన సందర్భంగా స్థానిక కార్యక్రమ నిర్వాహకులే నాకు రవాణా సౌకర్యం కల్పించారు. వారు ఏర్పాటు చేసిన కారు ప్రభుత్వానికి చెందింది. ఆ వాహనాన్ని ఎంపిక చేసుకోవడంలో గానీ, కావాలని అడగడంలో గానీ నా పాత్ర ఏమాత్రం లేదు. కేవలం లాజిస్టికల్ అవసరాల కోసమే నిర్వాహకులు దానిని సమకూర్చారు” అని ఆమె తన ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. అధికారులు తనకు వాహనాన్ని పంపారంటూ వస్తున్న వార్తలను కూడా ఆమె ఖండించారు..!!