in

deepika padukone left ‘spirit’ for allu arjun movie?

సందీప్ రెడ్డి రంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా స్పిరిట్. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వేరే సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఫ్రీ అవ్వగానే ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా జరుపనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉంది. కానీ ఆమె ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేసింది..దీనికి గల కారణాలు ఇవే అంటూ ఇప్పటికే చాలా పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అసలు విషయం బయటపడింది.

స్పిరిట్ సినిమా కథ దీపికా పదుకొనేకి నచ్చిందన్నది నిజమే. ఇక ఒప్పందంపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంది. అయితే ఇంతలోనే అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా నుంచి కూడా దీపికా కు ఆఫర్ వచ్చింది. అందులోని కథ, ఆమె పాత్ర దీపికకు బాగా నచ్చాయట..అయితే ఒకేసారి రెండు సినిమాలు చేయడం కష్టమని భావించిందట. పైగా రెండు మూవీస్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. కాబట్టి ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి వచ్చిందట. ఈ క్రమంలోనే దీపికా ‘స్పిరిట్’ ను పక్కన పెట్టి అల్లు అర్జున్ తో సినిమా ఎంచుకుందని తెలుస్తోంది.!!

sreeleela finally reacts to relationship and marriage rumors!