తను హీరోయిన్గా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. సమీరా రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”నేను సినిమాల్లో.. హీరోయిన్ గా చేసే సమయంలోనే శరీరంలో ఎన్నో ..మార్పులు వచ్చాయి. ఆ సమయంలో అందరూ నన్ను బూబ్ జాబ్ సర్జరీ (బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) సర్జరీ చేయించుకోమని చాలా ఒత్తిడి చేశారు. చాలా మంది చేయించుకుంటున్నారు..నీకు మాత్రం ఏమయింది అంటూ..నన్ను పదే పదే ఇబ్బంది పెట్టారు..
నాకు అది ఇష్టం లేదు అని చెప్పినా..వాళ్లెవ్వరు వినేవాళ్లు కాదు..అప్పట్లో ఏం చేయాలో తెలియక.. చాలా బాధపడ్డాను,” అని ఎమోషనల్ అయ్యింది సమీరా రెడ్డి. ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ లాంటివి చేయించుకునే సెలబ్రిటీస్ను తను తప్పుపట్టను..అని కానీ తను స్వయంగా తన సమస్యను..పరిష్కరించుకోగలను అని చెప్పుకొచ్చింది సమీర రెడ్డి. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరిస్తున్నాయి..!!