సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘కూలీ’ నుంచి ఇటీవల విడుదలైన మోనికా సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో నటి పూజా హెగ్డే వేసిన స్టెప్పులు సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఇటీవలే ఈ పాటకు సంబంధించి పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు..
“కాలు బెణికినా సరే, మోనికా పాట కోసం నా బెస్ట్ ఇచ్చా” అంటూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. “ఈ పాట కోసం నేను ఎంతో శ్రమించాను. ఎండ, వేడి, దుమ్ముతో కూడిన రోజు ఇది. కానీ స్క్రీన్‌పై గ్లామర్‌గా కనిపించేందుకు కష్టపడ్డాను. మోనికా పాటను థియేటర్‌లో చూస్తే మీరు డ్యాన్స్ చేయకుండా ఉండలేరు” అంటూ ఆమె చెప్పింది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 21 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది ఈ పాట..!!