ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. ఈ సినిమా కోసం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం – స్టార్ క్యాస్ట్, టాప్ టెక్నీషియన్లు, మాస్ అట్రాక్షన్ సాంగ్స్. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా మెరవనుంది. మరోవైపు జెనీలియా డిసౌజా కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది..
తాజాగా విడుదలైన రెండో పాట ‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబునే’ అనే పాట యూట్యూబ్‌లో రచ్చ చేస్తోంది..ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాటకు శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రేక్షకులను ఊపేసే ఈ పాటకు ఇప్పటికే అన్ని భాషల్లో కలిపి 9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. శ్రీలీల స్టెప్పులతో పాటు కిరీటీ రెడ్డి కూడా తన డాన్స్‌తో ఆకట్టుకున్నాడని సినీ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు..!!