రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ అగ్ర నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌లతో జాకీ భగ్నానీ నిర్మించిన ‘బడే మియా ఛోటే మియా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కేవలం రూ. 102 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ వైఫల్యం తర్వాత జాకీ ఆర్థికంగా చితికిపోయారని, తన జూహు ఆఫీసును అమ్ముకున్నారని ప్రచారం జరిగింది..
ఈ వార్తలపై జాకీ భగ్నానీ తాజాగా మాట్లాడుతూ “నేను దివాలా తీశానని, నా ఆఫీసును అమ్మేశానని, చివరకు తినడానికి కూడా డబ్బుల్లేవని రాశారు. నేను దేశం విడిచి పారిపోయానని కూడా ప్రచారం చేశారు. ఈ రూమర్స్ ఎక్కడ మొదలయ్యాయో నాకు తెలియడం లేదు. అయితే, నేను అమ్మేశానన్న ఆఫీసును తిరిగి సొంతం చేసుకున్నాను. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు” అని స్పష్టం చేశారు..!!