in

rashmika: hasn’t been home in over a year

టీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై రష్మిక స్పందించారు. “నేను ఏడాదిన్నరగా మా ఇంటికి వెళ్లలేదు. నాకు ఒక చెల్లి ఉంది. నాకంటే 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడు తనకి 13 ఏళ్లు. నేను కెరీర్ ప్రారంభించి ఎనిమిదేళ్లు అవుతున్నా ఈ సమయంలో నేను తనని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఈ విషయం నన్ను ఎంతో బాధిస్తోంది” అని చెప్పుకొచ్చారు. బిజీ షెడ్యూల్స్ వల్ల స్నేహితులకు కూడా దూరమయ్యానని..

ఒకప్పుడు విహారయాత్రలకు పిలిచే స్నేహితులు కూడా ఇప్పుడు తనకు సమయం ఉండదని భావించి పిలవడం మానేశారని వాపోయారు. ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన మాటలను రష్మిక గుర్తుచేసుకున్నారు. “కెరీర్‌లో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని, అదే వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉండాలంటే కెరీర్‌లో కొన్నింటిని వదులుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కానీ నేను మాత్రం ఈ రెండింటినీ సమన్వయం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాను” అని తెలిపారు..!!

Mrunal Thakur struggled with self-doubt and had suicidal thoughts!