టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఆమె ‘వి ద ఉమెన్’ అనే కార్యక్రమంలో పాల్గొని సినిమాల్లో ధూమపానం సీన్లపై, తన కెరీర్ ఎంపికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వ్యక్తిగతంగా నేను స్మోకింగ్‌ను ప్రోత్సహించను..
అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కూడా సిద్ధంగా లేను. ఇది నా అభిప్రాయం. అలాంటి సీన్ చేయమని ఒత్తిడి చేస్తే, ఆ సినిమా వదిలేయడానికి కూడా సిద్ధం. స్క్రీన్‌పై కనపడే ప్రతీ విషయం నిజ జీవితాన్ని ప్రతిబింబించదనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి” అని వ్యాఖ్యానించారు. సినిమా చేసేది అభిమానుల కోసం, కానీ అది నా మౌలిక విలువలకు విరుద్ధంగా ఉండకూడదు” అని వ్యాఖ్యానించారు..!!