నాగ చైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా చై మాట్లాడుతూ.. వర్క్ లైఫ్ కారణంగా మేమిద్దరం కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి అంతగా వీలు పడదు. క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయడానికి, అనుబంధాన్ని పెంచుకోవడం కోసం మేమిద్దరం కొన్ని రూల్స్ పాటిస్తాము. ముఖ్యంగా మేమిద్దరం హైదరాబాద్ లోనే ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాము..
ఆదివారాల్లో మాకు నచ్చిన విధంగా ఉంటాము. మూవీ నైట్, షికారుకు వెళ్లడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, లేదా కుక్ చేసుకోవడం ఇలా ఆ క్షణాలను ప్రత్యేకంగా, మధురజ్ఞాపకంగా మార్చుకుంటాము. తనకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. నాకు రేసింగ్ పై ఆసక్తి. ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్ వేస్తాము. ఇటీవల తనకు రేస్ట్రాక్ పై డ్రైవింగ్ నేర్పించాను. తను ఎంతో సంతోషించింది. ఎంజాయ్ చేసింది అని నాగచైతన్య చెప్పుకొచ్చారు..!!