నటి ప్రియాంకా చోప్రా, పురుషులు ఎలాంటి మహిళలను వివాహం చేసుకోవాలనే అంశంపై తాను చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు సులభంగా వైరల్ అవుతుండటం విచారకరమని ఆమె అన్నారు. “వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు, మంచి గుణాలున్న మహిళను వివాహం చేసుకోండి. ఎందుకంటే వర్జినిటీ అనేది ఒక్క రాత్రితో పోతుంది కానీ,
సభ్యత, సంస్కారం జీవితాంతం ఉంటాయి” అంటూ ప్రియాంక వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో, సదరు వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ప్రియాంకా చోప్రా, వాటిని తీవ్రంగా ఖండించారు. “ఇలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదు. ఈ విధంగా నేను ఎక్కడా మాట్లాడలేదు. ఇది కేవలం సామాజిక మాధ్యమాలలో ఎవరో సృష్టించిన వార్త మాత్రమే, ఇందులో ఎలాంటి నిజం లేదు” అని ఆమె స్పష్టం చేశారు..!!