వీరి కలయికలో ఓ భారీ మల్టీస్టారర్ ను అప్పట్లోనే దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ప్లాన్ చేశారు. ఆయన మంచి ఫామ్ లో ఉన్నప్పుడు వీరిద్దరినీ కలిసి మల్టీస్టారర్ గురించి చెప్పారు. వీరిద్దరూ అప్పుడు స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. అలాంటి టైమ్ లో వారి స్టార్ డమ్ కు తగ్గ కథ కోసం ఈవీవీ చాలా ప్రయత్నాలు చేశారు. ఏ కొంచెం తేడా వచ్చినా ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తాయని ఆయనకు తెలుసు.,
ఓ కథ రెడీ చేసినా..అది వారిద్దరికీ నచ్చకపోవడంతో ఆ మూవీ అక్కడే ఆగిపోయింది. కార్యరూపం దాల్చలేదు. దాంతో మరోసారి ఆ ప్రయత్నం చేయలేదు ఈవీవీ. ఎందుకంటే అప్పటికి ఇరువురికి భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది. ఆ టైమ్ లో మల్టీస్టారర్ చేస్తే బాగోదని ఆయన ఆగిపోయారంట. కానీ ఇద్దరితో వేర్వేరుగా మూవీలు తీసి హిట్ కొట్టారు..!!