కోలీవుడ్ కి నాని..ఓ తమిళ సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రను పోషించనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఇటీవల తెలుగులో నాని నటించిన ‘హిట్ 3’ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కార్తీ ఒక కీలకమైన పాత్రలను పోషించాడు. ‘హిట్ 4’లో హీరోగా చేసేది కార్తీనే..
ఇక తమిళంలో తను చేసే సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయమని కార్తీ కోరడంతో నాని అందుకు అంగీకరించాడని అంటున్నారు. గతంలో వెట్రి మారన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన తమిళ్ ఈ సినిమాకి దర్శకుడు. జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెబుతున్నారు. 1960ల నాటి కాలంలో ..రామేశ్వరం సముద్రతీర నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని సమాచారం..!!