గత కొద్ది రోజులుగా సమంతకు సంబంధించిన అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో సమంత నటించిన వెబ్ సిరీస్ వార్తలు కూడా ఒకటి. రక్త్ బ్రహ్మాండ్ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ ఆదిత్యరాయ్ కపూర్, సమంత ప్రధాన పాత్రలో నటించాల్సిన ఈ సిరీస్ కు దర్శకద్వయం రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మూవీ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఎన్నో షెడ్యూళ్లతో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నాము.
ఇప్పటికే ఇండోర్ టాకీ షెడ్యూల్ దాదాపు పూర్తైంది. ఆ తర్వాత భారీ అవుడ్ డోర్ షెడ్యూల్ ప్లాన్ చేశాము. ఇందులో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాము. వాటికి అనుకూలమైన వాతావరణం కోసం వెయిట్ చేస్తున్నాము. వర్షాలు పడే రోజుల్లో వీటిని చిత్రీకరించాలి. అలాగే పచ్చదనం కూడా అవసరం. అందుకే కొన్ని రోజులు ఆగి..ఇప్పుడు షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నాము అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ సిరీస్ పై వచ్చే రూమర్స్ పై క్లారిటీ వచ్చింది..!!