ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 రెడ్ కార్పెట్‌పై తొలిసారి అడుగుపెట్టిన బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తన దివంగత తల్లి, లెజెండరీ నటి శ్రీదేవిని తలుచుకుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. కేన్స్ తమ కుటుంబానికి, ముఖ్యంగా శ్రీదేవికి ఎంతో ఇష్టమైన ప్రదేశమని, ఇక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని జాన్వీ గుర్తుచేసుకున్నారు. వోగ్ ఇండియా కోసం చేపట్టిన “గెట్ రెడీ విత్ మీ” కార్యక్రమంలో జాన్వీ మాట్లాడుతూ, కేన్స్ పట్టణంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు..
“ఈ ప్రదేశం మా అమ్మకు హాలిడే కోసం రావడానికి అత్యంత ఇష్టమైన చోటు. మేం వరుసగా మూడు, నాలుగు వేసవి సెలవులు ఇక్కడే గడిపాం” అని జాన్వీ తెలిపారు. శ్రీదేవి కెరీర్‌లోని ముఖ్యమైన మైలురాళ్లను, అవార్డులను కూడా ఇక్కడే కుటుంబ సమేతంగా జరుపుకున్నామని ఆమె చెప్పారు. మేమంతా కుటుంబంగా కలిసి వేడుక చేసుకునేవాళ్ళం. ఆమె జీవితంలోని అన్ని పెద్ద ఘట్టాలను మేం ఇక్కడ జరుపుకున్నాం” అని జాన్వీ గతాన్ని గుర్తుచేసుకున్నారు..!!