వరుస సినిమాలతో నిత్యం బిజీగా ఉన్న స్టార్ హీరో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ నటించని పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినీ పరిశ్రమ స్థాపకుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి..
ఈ చిత్ర కథ భారతీయ సినిమా ప్రారంభం, అభివృద్ధి నేపథ్యంలో రూపొందించబోతోందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు బీ-టౌన్ సమాచారం. కథ విని ఆయన ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. “ఇది ఓ గొప్ప ప్రయాణాన్ని తెలిపే కథ. ఇది భారతీయ సినిమా ఆవిర్భావాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. స్క్రిప్ట్ విన్న వెంటనే ఎన్టీఆర్ అంగీకరించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాజెక్టుపై బృందం చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఫైనల్ స్క్రిప్ట్‌ను ఫిక్స్ చేశారు” అని సమాచారం..!!