చిరంజీవి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ (మెగా 157) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలు కూడా జరుపుకుంది. త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతోన్నారు మేకర్స్. ఈ లోపు చిరు కోసం అనిల్ కథానాయికను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడిగా నయనతార నటిస్తోందని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటినే నిజం చేస్తూ మేకర్స్ ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు.
‘మెగా 157’ ప్రాజెక్ట్‌లోకి నయన్ వచ్చిందంటూ వదిలిన వీడియో ఆకట్టుకుంటోంది. మరోసారి అనిల్ రావిపూడి తనదైనశైలిలో ఈ వీడియోను రూపొందించారు. ఒక విధంగా చెప్పాలంటే… అసలు ప్రమోషన్స్ అంటే నో చెప్పే నయన్‌తోనే సినిమా ఆరంభానికి ముందే ఆమెను అనిల్ ప్రమోషన్స్‌లోకి తీసుకొచ్చారనే చెప్పాలి. వీడియో చివర్లో సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అని ఇద్దరూ చిరు ఐకానిక్ పోజులు పెట్టడం ఆకట్టుకుంటోంది. అలాగే చిరంజీవి మేనరిజంలో హలో మాస్టారు..కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ చెప్పిన సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి..!!