స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్
గతంలో కూడా విశాల్ ఇదే విధంగా ఓ వేదిపై మాట్లాడుతుండగా చేతిలో మైకు వణికిపోవడం, నీరసంగా ఉన్నవీడియో వైరల్ అయింది. అయితే అప్పుడు అతనికి ఫుల్ ఫీవర్ ఉందని అందుకే అలా షివర్ అయ్యారని తర్వాత వార్తల్లో వచ్చింది. ఇప్పుడు ఈవిధంగా కుప్పకూలిపోవడంతో ఆయన ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే కంగారు పడుతున్నారు అభిమానులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై తన PR టీమ్ క్లారిటీ ఇచ్చింది..
తమిళ్ హీరో విశాల్ హెల్త్ కండిషన్
తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై వారు వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే విశాల్ అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం విశాల్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు..!!