తాజాగా చరణ్ పెద్ది సినిమాకోసం బాబాయ్ పవన్ కెరీర్లోనే వన్ అఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సాంగ్ తన సినిమాలో రీమేక్ చేయబోతున్నాడట. ఆ పాట ఏంటంటే..ఖుషిలో అమ్మాయి సన్నగా సాంగ్. ఈ పాటను రీమేక్ చేసి పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నారని టాక్. దీనికి సంబంధించిన లీగల్ రైట్స్అ లాగే అన్ని విషయాలను మూవీ టీం కన్ఫర్మ్ చేసుకున్నారని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని సమాచారం.
చరణ్ స్వయంగా బుచ్చిబాబుకు ఈ సజెషన్ ఇచ్చాడని..బాబాయ్ సినిమాలోని ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ రీమేక్ చేద్దామంటూ అతనికి వివరించాడని.. టైమింగ్ రైమింగ్ కూడా కలిసి రావడంతో బుచ్చిబాబు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ టాక్. ఇప్పుడు తమ సినిమాలో ఈ సాంగ్ రీమేక్ చేయబోతున్నారని..కచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఇంట్రెస్టింగ్ లెవెల్ లో ఈ రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.!1