అట్లీ చివరిగా జవాన్ సినిమాతో తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలు దానికి మించి పోయే రేంజ్‌లో ప్లాన్ చేశాడట. ఇక ఇప్పటికే సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చేసిన టీం..త్వరలో సినిమా పూజా కార్యక్రమాలను గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్నారు. అయితే మొదటి నుంచి సినిమాపై భార్య హైప్ నెలకొనేలా అట్లీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే..పూజా కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ప్రభాస్‌ను దించనున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తి చేసేసినట్లు సమాచారం..
అంతేకాదు బన్నీ సినిమా కోసం వాయిస్ ఓవర్ కూడా ప్రభాస్ ఇవ్వబోతున్నాడు అంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టైంలో ప్రభాస్ వాయిస్ ఇస్తే బాగుంటుందని అట్లీ ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాడట. కానీ..ప్రభాస్ దానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్. కానీ..పూజ కార్యక్రమానికి మాత్రం ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా రావడం పక్కా అంటున్నారు. ఇలాంటి క్రమంలోనే ఇద్దరు పాన్ ఇండియన్ టాప్ స్టార్స్ ఒకే ఈవెంట్లో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు ఎలాంటి పండగ వాతావరణం నెలకొంటుందో తెలిసిందే..!!