ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, “నార్త్ ఇండియాలో నా పేరు మీద ఒక గుడి ఉంది. బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఉన్న ఊర్వశి టెంపుల్ నా కోసం కట్టారు. అలాగే టాలీవుడ్‌లో చిరంజీవి సినిమాతో ఎంట్రీ ఇచ్చి, వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో నాకు ఇక్కడ కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఉత్తరాదిలో లాగే దక్షిణాదిలో కూడా నా అభిమానులు గుడి కట్టాలని కోరుకుంటున్నాను,” అని అన్నారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆమె వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ‘తనకు గుడి కట్టాలి’ అని కోరడంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో కూడా ఊర్వశి రౌతేలా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి..!!