బన్నీ, అట్లీ స్వయంగా అమెరికా వెళ్లి అక్కడ వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడటం చూస్తుంటే..ఇది విజువల్ వండర్ గా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. పైగా అట్లీ స్క్రిప్ట్ కు హాలీవుడ్ టెక్నీషియన్లు ఎలివేషన్ ఇవ్వడం చూస్తుంటే..కథ వేరే లెవల్లో ఉంటుందేమో అని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం మిగతా నటీనటులను తీసుకునే పనిలో పడ్డారు. ఇందులో ఇద్దరు హాట్ హీరోయిన్లను తీసుకుంటున్నారంట..
బాలీవుడ్ ముద్దుగుమ్మలు దిశా పటానీ, జాన్వీకపూర్ లను తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉన్న నటీనటులనే తీసుకోవాలని భావిస్తున్నారంట. అందులో భాగంగానే ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దిశాపటానీ, జాన్వీకపూర్ అయితే బెస్ట్ అని చూస్తున్నారు. వీరిద్దరికీ బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా కల్కితో దిశా పటానీ, దేవర మూవీతో జాన్వీకపూర్ పాన్ ఇండియా మార్కెట్ లో గుర్తింపు పొందారు..!!