in

Kartik Aaryan denies rumors of dating sreeleela!

శ్రీలీల పేరు ఈ మధ్య బీటౌన్ లో బాగా వినిపిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, ఇందులో నటిస్తున్న మరో స్టార్‌ కార్తిక్ ఆర్యన్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, ఇటీవల వైరల్ అయిన ఫొటోలు ఈ రూమర్లకు బలాన్నిచ్చాయి. ఇక కార్తిక్ తల్లి కూడా ఓ ఫంక్షన్‌లో తన కోడలు గురించి మాట్లాడినట్లు వార్తలు రావడంతో ఇద్దరి ప్రేమ బలంగా మారిందన్న అభిప్రాయాలు వినిపించాయి.

ఇంతలో శ్రీలీల ప్రేమపై ఓ చిట్ చాట్‌లో చేసిన కామెంట్స్ కూడా ఆసక్తిని రేపాయి. దీంతో నెటిజన్లు కార్తికే శ్రీలీల బాయ్‌ఫ్రెండ్ అని ఖాయం చేసేసారు. కానీ వీటన్నింటికి బ్రేక్ వేసేలా కార్తిక్ ఆర్యన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి గర్ల్‌ఫ్రెండ్ లేదని, తాను పూర్తి స్థాయిలో సోలోగా ఉన్నానని చెప్పారు. సినిమాల్లోని హీరోయిన్లతో తనకు స్నేహం మాత్రమే ఉందని తేల్చేశారు..!!

milky beauty Tamannaah Celebrates 20 Years in Cinema!

Siddu Jonnalagadda: pooja hegde was never a choice for ‘jack’