
అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఓ హిందీ సినిమాకు సైన్ చేసింది. షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం పెరిగిందని, ఆ క్రమంలోనే డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తకి ఆర్జ్యం పోస్తూ..కార్తిక్ తల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘‘మా ఇంటికి ఓ మంచి వైద్యురాలు కోడలిగా రావాలని కోరుకుంటున్నాం’’ అని చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీలకే ఈ వ్యాఖ్యలు అన్వయించారని నెటిజన్లు భావిస్తున్నారు.
ఒక వర్గం వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చెబుతుండగా, మరొక వర్గం మాత్రం ఇది కేవలం స్నేహమని స్పష్టం చేస్తోంది. వీటిపై ఇద్దరూ ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ క్రమంలో మరికొంతమంది ఇంకా ముందుకు వెళ్లి..వీరిద్దరికి పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని కామెంట్స్ పెడుతున్నారు. కొన్ని బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం..వాళ్ళిద్దరి సినిమా షూటింగ్ అవ్వగానే..వీరిద్దరూ కూడా ప్రేమ విషయం బయట పెట్టాలి అనుకుంటున్నారని..అలానే శ్రీలీల కి తన చదువు పూర్తి అవ్వగానే పెళ్లి ఉంటుందని..తెలుస్తొంది..!!