ఇప్పటికే స్క్రిప్ప్ట్ వర్క్ స్టార్ట్ చేసాడట. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని, సెకండ్ పార్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడట. అనిల్ రావిపూడి మేకింగ్ స్పీడ్ తెలిసిందే. జెట్ స్పీడ్ తో సినిమాలు తెరకెక్కించి, హిట్ కొట్టడం రావిపూడి స్పెషల్. ఈ క్రమంలో హీరోయిన్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే 10 మంది పేర్లు పరిశీలించారని సమాచారం. వీరిలో ప్రముఖంగా అదితిరావు హైదరి పేరు వినిపించింది. చిరు ఏజ్ కి అదితి లుక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అనుకున్నారు. చిరు – అదితీ జోడీ కూడా ఫ్రెష్ గా ఉంటుందని భావించారు..
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు అంజలి పేరు తెరపైకి వచ్చింది. చిరు పక్కన అంజలి అయితే బాగుంటుంది అన్న సెకండ్ ఆలోచన కూడా చేస్తున్నారట. అంజలి ఇప్పటికే వెంకటేష్, బాలయ్యలతో నటించింది. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అంజలి అయితే అనిల్ కథకి సరిగ్గా సరిపోతుంది అని భావిస్తున్నాడట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి లని తీసుకున్నప్పుడు అంతా సందేహ పడినా సినిమా హిట్ లో వారే కీలకంగా నిలిచారు. ఇప్పడు కూడా అంజలి పాత్ర అలాగే ఉంటుంది అని టాక్..!!