సమంతా తెలుగులో సినిమాలలో నటించక చాలారోజులు అవుతోంది. ఆమెను వెండితెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో ఓ క్రేజీ రూమర్ వినిపిస్తూ ఉంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ నటిగా వెలుగొందిన సమంత ఇప్పుడు బిగ్ స్క్రీన్, ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇటీవలి కాలంలో, శాకుంతలం, ఖుషి, యశోద వంటి చిత్రాలు అన్నీ విఫలమయ్యాయి..
ఆమె సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఏమిటంటే, సుకుమార్- రామ్ చరణ్ సరసన సమంతను నటింపజేయాలని ఆలోచిస్తున్నారట. ఇదే కాంబినేషన్ లో ఇంతకు ముందు రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ వచ్చింది. అదే సమయంలో రష్మికను కూడా ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నారట. సుకుమార్ ఇంతకు ముందు పుష్పలో ఆమెతో కలిసి పనిచేశారు..