in

Nayanthara asks fans to stop calling her ‘Lady Superstar’!

హీరోలతో సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో నటి నయనతార ఒకరు. నయనతారను లేడీ సూపర్‌ స్టార్‌గా పిలుస్తారనే విషయం తెలిఇసందే. అయితే తాజాగా దీనిపై నయనతార కీలక వ్యాఖ్యలు చేసింది. అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. తాను “లేడీ సూపర్‌స్టార్‌” అనే బిరుదుతో పిలిపించుకోవాలని కోరడం లేదని, నయనతార అనే పేరు తనకు ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ విషయమై ఆమె పోస్ట్‌ చేస్తూ..

‘మీ అందరి ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా జీవితం ఓ తెరిచిన పుస్తకం. నా విజయాల్లో, కష్టకాలాల్లో మీరు నన్ను అండగా నిలబెట్టారు. “లేడీ సూపర్‌స్టార్‌” అనే బిరుదును ఎంతో ప్రేమగా ఇచ్చారు. కానీ, నయనతార అనే పేరు నాకు మరింత సాన్నిహిత్యంగా అనిపిస్తుంది. ఇలాంటి బిరుదులు గొప్పవి, కానీ అవి కొన్నిసార్లు నాకు కంఫర్ట్‌గా అనిపించవు. సినిమా మనందరినీ కలిపే మాధ్యమం. అందుకే, ఆ గొప్పతనాన్ని కలిసికట్టుగా సెలబ్రేట్‌ చేసుకుందాం’ అని రాసుకొచ్చారు..!!

which teaser impressed you the most ?