గతేడాది ఫిబ్రవరి 21న జాకీని రకుల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో మా ఆయనను బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అతనికి దగ్గరగా ఉన్న ఫీల్ రావడం కోసం ఆయన బట్టలు వేసుకుంటున్నా. అప్పుడు నాకు ఆయన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది..
అంతేకాదు ఓ సెల్ఫీ ఫొటోను పంచుకున్నారు రకుల్. అందులో ఆమె జేబీ అనే పేరుతో భర్త పేరును సూచించే హుడి ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇక రకుల్ మాటలపై ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ కోసం తప్పదంటూ కామెంట్స్ పెడుతున్నారు. రకుల్ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పారు. స్టార్ హీరోలతో నటించి మెప్పించారు. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మకాం మార్చారు..!!