in

Samantha shares a Cryptic post about ‘Being Alone’!

ఒంటరితనం చాలా కష్టమని సమంత  చెప్పారు. అయితే, తాను మాత్రం ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. మూడు రోజుల పాటు అందరికీ దూరంగా, ఒంటరిగా, మౌనంగా గడిపానని తెలిపారు. ఫోన్, సోషల్ మీడియా, షూటింగ్.. అన్నింటినీ పక్కన పెట్టి తనతో తాను మాత్రమే ఉన్నట్లు వివరించారు. మూడు రోజులు మాత్రమే కాదు ఎన్నిరోజులు ఉండమన్నా అలా ఉంటానని పేర్కొంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ‘మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి’ అంటూ తన అభిమానులకు సూచించారు.

‘మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. భయంకరమైనది. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను’ అంటూ పోస్టులో వెల్లడించారు. ఇటీవల సమంత నటించిన వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’ ఐకానిక్ గోల్డ్ అవార్డ్ తో పాటు ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డునూ గెలుచుకుంది. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమంత.. మరోపక్క రక్త్ బ్రహ్మాండ్ షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు..!!

Rakul Preet about why her wedding was complete private!

nabha natesh on her struggling days after the accident!