తం‘డేల్ చిత్రానికి టాక్ బాగున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదని ట్రేడ్ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా విడుదల తరువాత కూడా ప్రమోషన్స్‌ను కొనసాగిస్తోంది. అయితే సినిమా విడుదల తరువాత ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రమోషన్‌లో కూడా సాయి పల్లవి కనిపించలేదు. ఇటీవల చిత్రబృందం ఆంధ్రా, సీడెడ్ టూర్లకు కూడా వెళ్లారు. దీంతో పాటు సక్సెస్ సెలబ్రేషన్స్, ప్రెస్‌మీట్స్, ఇంటర్వ్యూల్లో ఎక్కడా కూడా హీరోయిన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది..
సాయి పల్లవి బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే దీనికి మరో కారణం కూడా ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమాలో సాయి పల్లవి నటించిన కొన్ని కీలక సన్నివేశాలు, ఆమెకు ఎంతో ఇష్టమైన సీన్స్‌ను దర్శకుడు చందు మొండేటి తొలగించడమే కారణమని సమాచారం. తన సీన్స్‌ను తొలగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, దీంతో సినిమా రిలీజ్ తరువాత ఆమె పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది..!!