ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో తనకు శ్యామ్ సింగరాయ్ సినిమాలో దేవదాసిగా నటించడం చాలా బాగా నచ్చిందని ఆ పాత్ర కోసం ఎర్రని చీర ఆ మేకప్ వేసుకోవడం తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమెకు అవకాశాలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు..
అయితే ఈ సినిమాలో నటించడానికి గల కారణాన్ని కూడా ఈమె తెలియజేశారు. పౌరాణిక చిత్రాలలో నటించాలన్నది నా చిరకాల కోరిక అని సాయి పల్లవి తెలిపారు. ఇలా పౌరాణిక చిత్రాలలో నటించాలని ఆసక్తితో ఎదురుచూస్తున్న నాకు రామాయణం సినిమాలో అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పానని నా ఆ కోరిక కారణంగానే ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతున్నానంటూ తెలిపారు. ఇక ఫిట్నెస్ కోసం తాను జిమ్ కి పెద్దగా వెళ్లను. ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడటం ఖాళీగా ఉంటే డాన్స్ చేస్తూ ఉంటానని అదే నా ఫిట్నెస్ సీక్రెట్ అంటూ సాయి పల్లవి వెల్లడించారు..!!