in

Samantha & Raj Nidimoru: Are They Dating?

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ నిజమేనా?
సమంత డేటింగ్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఎక్కడ కూడా సమంత స్పందించలేదు కానీ తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం సమంత డేటింగ్ లో ఉందని ఏ క్షణమైన ఈమె తన రెండవ పెళ్లి గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ భావిస్తున్నారు. తాజాగా సమంత తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో పికిల్‌బాల్ టోర్నమెంట్‌ కి సంబందించిన ఫోటోలు షేర్ చేసింది. ఇందులో పికిల్‌బాల్ ప్లేయర్స్ తో కలసి సరదాగా గడిపినట్లు తెలుస్తోంది..

దర్శకుడు రాజ్ నిడిమోరు తో సమంత డేటింగ్ పిక్స్ వైరల్
అయితే ఈ ఫొటోలలో సిటాడెల్: హనీ బన్నీ దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా కనిపించాడు. ఈ ఫోటోలలో సమంత ఏకంగా తన చేయి పట్టుకుని కనిపించడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ సమంత డేటింగ్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇలాంటి తరుణంలోనే వీరిద్దరూ ఇలా చట్టా పట్టాలేసుకొని కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని నేటిజన్స్ ఫిక్స్ అయ్యారు అయితే ఈ వార్తలను కొంతమంది సమంత అభిమానులు కొట్టి పారేస్తున్నారు..!!

Sandeep Vanga: Sai Pallavi Was The First Choice For Arjun Reddy

Tollywood producer K P Chowdary dies by suicide in Goa!