in

jhanvi kapoor: i may quit movies after marriage

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ..పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. జాన్వీకపూర్‌కు తిరుపతి అంటే ఇష్టమనే విషయం చాలాసార్లు చెప్పారు. ఇప్పటికే తిరుపతిని పలుసార్లు దర్శించుకున్నారు. అంతేకాదు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ఉందని తన కోరికను కూడా తెలిపారు..

రీసెంట్‌గా కరణ్ జొహర్ షోలో మాట్లాడిన జాన్వీ..పెళ్లి చేసుకుని తిరుమలలో భర్తతో సెటిల్ అవ్వాలని.. ముగ్గురు పిల్లలతో హాయిగా గడపాలని..ప్రతిరోజు అరటి ఆకులో అన్నం తినాలి, గోవిందా గోవిందా అని స్మరించుకోవాలి. అలాగే మణిరత్నం సినిమాల సంగీతం వింటూ కూర్చోవాలి అని తెలిపింది. అంతేకాదు పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి..!!

Which Sankranti movie you enjoyed the most?