in

lucky girl meenakshi Chaudhary flooded with many offers!

గుంటూరు కారం’ సినిమాలో మీనాక్షికి పెద్ద రోల్ ఇవ్వకపోయినా, ఆమెను త్రివిక్రమ్ చాలా గ్లామరస్ గా చూపించాడు. ఈ అమ్మాయిని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవచ్చని అనుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలోనే మీనాక్షికి ‘లక్కీ భాస్కర్’ సినిమాతో పెద్ద హిట్ పడింది. ఆ సక్సెస్ ను ఆమె ఎంజాయ్ చేస్తూ ఉండగానే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో అడుగుపెట్టింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. నటనకి స్కోప్ ఉన్న పాత్ర మీనాక్షికి దక్కడం..గ్లామర్ పరంగాను ఆమెకి మంచి మార్కులు పడటం కలిసొచ్చింది..

ఈ సినిమాతో తన కెరియర్లోనే ఆమె హిట్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే మీనాక్షి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దాంతో పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి ఆమెకి అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోల సరసన ప్రధానమైన నాయికగా ఆమె కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఆమె ప్రభాస్, మహేశ్ బాబు, చరణ్, ఎన్టీఆర్, రామ్, నితిన్ వంటి హీరోల సరసన మెరిసే అవకాశం లేకపోలేదు. పూజ హెగ్డే, రష్మిక, కీర్తి సురేశ్ ఏమంత యాక్టివ్ గా లేకపోవడం..శ్రీలీల, కృతి శెట్టి జోరు తగ్గడం మీనాక్షికి కలిసొచ్చిందని అంటున్నారు..!!

samantha has skin allergy problem?