పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె, మధ్యలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంది. అందులో భాగంగానే కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే శరీరం పై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు వచ్చేవని వైద్యులను సంప్రదించగా.. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారట. ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది సమంత. కొంతకాలం తర్వాత సమస్య నయమయ్యింది కానీ ఆమెను మళ్ళీ మయోసైటిస్ అనే వ్యాధి వెంటాడింది.